News March 19, 2024
రొళ్ల మండలంలో యువతి మృతి

రొళ్ల మండలం కాకి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన శివన్న, రాధమ్మ దంపతుల కుమార్తె మేఘన (19) మంగళవారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రొళ్ల ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిరకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 19, 2026
అనంతపురం: 8 పంచాయతీలకు ఈ-ఆటోల పంపిణీ

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా అనంతపురం జిల్లాకు మంజూరైన 8 ఎలక్ట్రికల్ శానిటేషన్ ఆటోలను ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సోమవారం ప్రారంభించారు. ఈ ఆటోల ద్వారా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. త్వరలో జిల్లాకు మరో 100 ఈ-ఆటోలు రానున్నాయని తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఎన్ఐసీ భవనం వద్ద కొత్త క్యాంటీన్‌ను ప్రారంభించారు.
News January 19, 2026
గుంతకల్లు యువకుడికి నారా లోకేశ్ భరోసా

అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న గుంతకల్లుకు చెందిన యువకుడు నవీన్ పరిస్థితిని గోవర్ధన్ అనే వ్యక్తి ఎక్స్(ట్విట్టర్) వేదికగా మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. నవీన్ పేగు సంబంధిత ఆపరేషన్ చేయించుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన లోకేశ్ బాధితుని వివరాలు అందాయని, అతనికి వైద్య సాయం అందేలా తన కార్యాలయం అధికారులతో సమన్వయం చేస్తోందని X వేదికగా భరోసా ఇచ్చారు.
News January 19, 2026
రాష్ట్ర స్థాయి అధికారిగా మన అనంత జిల్లా వాసి

ఏపీ RTI కమీషనర్‌గా అనంతపురానికి చెందిన గాజుల ఆదెన్న నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గాజుల ఆదెన్న మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఈయన అనంతపురం నగర పాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పని చేశారు.


