News March 14, 2025

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి: కలెక్టర్

image

రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ జిల్లా జి. రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం పాణ్యం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ సిబ్బంది పనితీరు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, రోగుల సదుపాయాల గురించి పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా స్టాక్ పూర్తికాక ముందే ఇండెంట్ చేసి మందులను తెప్పించుకోవాలన్నారు.

Similar News

News December 24, 2025

ఏలూరు: యాక్సిడెంట్‌లో తల్లిదండ్రులు మృతి.. అనాథలైన పిల్లలు

image

మండవల్లి మండలంలోని కానుకొల్లు గ్రామానికి చెందిన భార్యాభర్తలు పాలెపు వెంకన్న(41), గృహలక్ష్మి(37)లు కంకిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విజయవాడ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు కుమార్తెలను చూడటానికి బైక్‌పై ఈ నెల 21న వెళ్తుండగా కారు ఢీకొంది. వెంకన్న అక్కడికక్కడే చనిపోగా.. చికిత్స పొందతూ గృహలక్ష్మి నిన్న కన్నుమూసింది. దీంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.

News December 24, 2025

నంద్యాల: ఎగ్గు అట్టు తినేట్టట్టు లేదుగా..!

image

నంద్యాల జిల్లాలో గుడ్డు ఆకాశానికి ఎగుకుతోంది. డజన్ గుడ్లు రూ. 100కు పైనే అమ్ముడవుతున్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే కోడి గుడ్ల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గుడ్లు కొనాలంటే జంకాల్సిన పరిస్థితి ఏర్పడిందని, గుడ్డు కూర తినేదెలా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఒక కోడిగుడ్డు ధర రూ. 8గా ఉంది. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.

News December 24, 2025

గోళ్లు పుచ్చిపోయాయా?

image

ఎక్కువగా నీళ్లల్లో తడవడం, పనిచేయడం వల్ల కాలి గోళ్లు పచ్చబడి, తేలికగా విరిగిపోతుంటే నెయిల్ ఫంగస్‌ సోకినట్లని నిపుణులు చెబుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్, నీళ్లు ఒక ప్లాస్టిక్ టబ్లో కలుపుకోవాలి. ఈ నీళ్లలో పాదాలను అరగంట పాటు ఉంచాలి. ఇలా ప్రతి రోజూ క్రమం తప్పక చేయాలి. ఫంగస్ వదిలి గోళ్లు సాధారణ రంగులోకి వచ్చినా, ఈ చిట్కాను మానేయకుండా మరికొన్ని రోజుల వరకూ కొనసాగించాలి.