News March 14, 2025
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి: కలెక్టర్

రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ జిల్లా జి. రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం పాణ్యం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ సిబ్బంది పనితీరు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, రోగుల సదుపాయాల గురించి పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా స్టాక్ పూర్తికాక ముందే ఇండెంట్ చేసి మందులను తెప్పించుకోవాలన్నారు.
Similar News
News March 22, 2025
నంద్యాల జిల్లాలో దారుణ హత్య

నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం లింగాపురంలో శనివారం దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి పొలం వద్దకు వెళ్తుండగా కొత్తచెరువు దగ్గర మాటువేసిన గుర్తుతెలియని దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
News March 22, 2025
మచిలీపట్నం విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

మచిలీపట్నంలోని జడ్పీ స్కూల్ విద్యార్థులు టూర్‌కి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో శనివారం ఉదయం ఆగి ఉన్న లారీని వీరి బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది విద్యార్థులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News March 22, 2025
భువనగిరి జిల్లాలో వర్షపాత వివరాలు

భువనగిరి జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా భువనగిరి మండలంలో 29మిమీ వర్షం కురవగా, అత్యల్పంగ మోత్కూర్ మండలంలోని దతప్పగూడెంలో 0.8మిమీ వాన పడింది. యాదగిరిగుట్టలో 23.8మిమీ, బొమ్మలరామారం 23.3మిమీ, మూటకొండూర్ 20 మిమీ, రాజాపేట 17.3మిమీ, తుర్కపల్లి 16.3మిమీ, ఆత్మకూర్ 7.8మిమీగా నమోదైంది.