News March 16, 2025

రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: అదనపు కలెక్టర్

image

ఆసుపత్రుల్లో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సుధీర్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో వేసవి నేపథ్యంలో ఫ్యాన్లు, తాగునీరు, మొదలగు సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.

Similar News

News November 6, 2025

GNT: LLB రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన ఎల్ఎల్‌బి రీవాల్యుయేషన్ ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. ఎల్ఎల్‌బి మూడో సంవత్సరం మూడో సెమిస్టర్, ఐదవ సంవత్సరం ఏడో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చని చెప్పారు.

News November 6, 2025

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

తెనాలి 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాజర్‌పేటలో వ్యభిచార గృహంపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ విజయ్ కుమార్ నేతృత్వంలో వెళ్లిన టాస్క్‌ఫోర్స్ బృందం వారి నుంచి రూ.500 నగదు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుంది. అసాంఘిక కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.

News November 6, 2025

ట్రంప్ ఉక్కుపాదం.. 80వేల వీసాల రద్దు

image

అక్రమ వలసదారులతోపాటు వీసాలపై వచ్చి ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. జనవరి నుంచి 80వేల వీసాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. హింస, దాడులు, చోరీ, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వారే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గడువు ముగిసినా దేశంలో ఉండటం, స్థానిక చట్టాలను లెక్కచేయని 6వేలకు పైగా స్టూడెంట్ల వీసాలూ రద్దయినట్లు మీడియా తెలిపింది.