News June 1, 2024

రోజా ఓడిపోబోతుంది: ఆరా

image

ఈసారి ఎన్నికల్లో మంత్రి రోజా ఓటమి ఖాయమని ఆరా సర్వే తేల్చి చెప్పింది. 2014, 2019 ఎన్నికల్లో ఆమె స్పల్ప ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. తాజా ఎన్నికల్లో పరాజయం తప్పదని ఆరా చెప్పడంతో.. పరోక్షంగా టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ విజయం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాను అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

Similar News

News September 20, 2024

సదుం: నాలుగేళ్ల చిన్నారి మృతి

image

అనారోగ్యంతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన సదుం మండలంలో శుక్రవారం జరిగింది. జాండ్రపేటకు చెందిన షేహాన్ షా కుమార్తె సభా పర్వీన్ ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ పీలేరులో చికిత్స పొందింది. ఈ క్రమంలో నేడు మళ్లీ చిన్నారి హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

News September 20, 2024

బంగారుపాళ్యం నుంచే దండయాత్రగా మారింది: లోకేశ్

image

కుప్పం నుంచి చేపట్టిన తన యువగళం యాత్ర బంగారుపాళ్యం నుంచి దండయాత్రగా మారిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘యువగళాన్ని అడ్డుకునేందుకు ఆనాటి ప్రభుత్వం జీవో తెచ్చి అడ్డంకులు సృష్టించింది. అయినా భయపడలేదు. నాపై 23 కేసులు నమోదు చేశారు. పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు సూపర్-6 పథకాలు ఉపయోగపడతాయి. సీఎం చంద్రబాబుతో చర్చించి వాటిని అమలు చేస్తా’ అని లోకేశ్ చెప్పారు.

News September 20, 2024

మొగిలి ఘాట్‌లో మరో ప్రమాదం

image

బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌లో మరో ప్రమాదం జరిగింది. ఇటీవల ఇక్కడ ఘోర ప్రమాదం జరగడంతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. వీటిపై అవగాహన లేని ఓ టెంపో ట్రావెలర్ వేగంగా వచ్చి ఇక్కడ అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వారిని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.