News October 3, 2024

రోజా గారూ.. అప్పుడు ఏమైంది: వాసంశెట్టి

image

అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేయగా..దీనికి కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. ‘రోజా గారూ మీరు మంచి మనసుతో ఇలా స్పందించడం చాలా ఆనందం. కానీ ఆరోజు రాజకీయాలకు సంబంధంలేని లోకేశ్ తల్లి భువనేశ్వరిని నిండు సభలో YCP నేతలు అవమానించినప్పుడు పకపక నవ్వారు కదా అప్పుడు ఏమైంది మీ స్పందన?’అని వాసంశెట్టి ట్వీట్ చేశారు.

Similar News

News October 16, 2025

క్యాన్సర్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు: కలెక్టర్

image

రాజమహేంద్రవరం జీజీహెచ్‌‌లోని ఆంకాలజీ విభాగంలో క్యాన్సర్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. గురువారం ఆసుపత్రిలో ఆమె వైద్య సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు, మౌలిక వసతులు, వైద్య పరికరాల స్థితి, సిబ్బంది భర్తీ, నిర్మాణ పనుల పురోగతి, పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులతో కలెక్టర్ సమగ్రంగా చర్చించారు.

News October 16, 2025

18న రాజమండ్రిలో జాబ్ మేళా

image

తూర్పుగోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 18న రాజమండ్రిలోని మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ ప్రాంగణంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్రప్రసాద్‌ తెలిపారు. గురువారం ఆయన రాజమండ్రిలో మాట్లాడారు. మేళాలో పలు ప్రైవేటు సంస్థల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని ఆయన పేర్కొన్నారు.

News October 15, 2025

RJY: నవంబర్ 3 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె

image

నవంబర్ 3 నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాకు ఆయన సమ్మె నోటీసు అందజేశారు. కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే ఈ సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.