News October 3, 2024

రోజా గారూ.. అప్పుడు ఏమైంది: వాసంశెట్టి

image

అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేయగా..దీనికి కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. ‘రోజా గారూ మీరు మంచి మనసుతో ఇలా స్పందించడం చాలా ఆనందం. కానీ ఆరోజు రాజకీయాలకు సంబంధంలేని లోకేశ్ తల్లి భువనేశ్వరిని నిండు సభలో YCP నేతలు అవమానించినప్పుడు పకపక నవ్వారు కదా అప్పుడు ఏమైంది మీ స్పందన?’అని వాసంశెట్టి ట్వీట్ చేశారు.

Similar News

News November 7, 2024

రాజమండ్రి: ‘అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే చర్యలు’

image

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇసుక కార్యకలాపాలు చేయటం నిషేదమని జిల్లా కలెక్టర్ ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు నిర్వహించరాదని, అనుమతి పత్రాలు లేకుండా రవాణా చేస్తే శిక్షార్హులు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామాన్య అవసరాలకు మించి ఇసుక అక్రమ నిల్వలు చేయరాదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

News November 7, 2024

తూ.గో: TODAY TOP NEWS

image

*ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ
*మొన్న తిట్టారు.. ఇవాళ మెచ్చుకున్నారు: మంత్రి సుభాష్
*మండపేట: కారులో నుంచి చెలరేగిన మంటలు
*రాజమండ్రి మహిళకు మంత్రి లోకేశ్ హామీ
*పాశర్లపూడిలంకలో త్రాచుపాము హల్‌చల్
*కాకినాడ: హత్య కేసులో ఐదుగురు అరెస్ట్
*కాట్రేనికోన: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
*కాకినాడ: 11న ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్
*జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ: కలెక్టర్

News November 6, 2024

రాజమండ్రి మహిళకు మంత్రి లోకేశ్ హామీ

image

రాజమండ్రికి చెందిన శిరీష అనే మహిళ జీవనోపాధి కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్లి అక్కడ శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు మంత్రి లోకేశ్‌కు ఎక్స్‌లో విన్నవించుకున్నారు. శిరీషను స్వదేశానికి తీసుకురావాలని పోస్టు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్ ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.