News April 7, 2025
రోజా శ్రీవారి వారసురాలా..?: కిరణ్ రాయల్

టికెట్ల పేరుతో గత ప్రభుత్వంలో మాజీ మంత్రి రోజా దోచుకున్నారని జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. ‘వేంకటేశ్వర స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారని రోజా అంటున్నారు. శ్రీవారు ఏమైనా రోజాకు ఫోన్ చేసి తనకు నిద్ర లేదని చెప్పారా? ఇది కదా ఓవర్ యాక్షన్ అంటే. ఆమె వేంకటేశ్వర స్వామి వారుసురాలా? లేదా అన్నమయ్య చెల్లా? దేవుడి పేరు చెప్పి దర్శన టికెట్లతో వ్యాపారం చేసింది’ అని ఆయన ఆరోపించారు.
Similar News
News April 20, 2025
వక్ఫ్ ఆస్తులను కొట్టేసేందుకు కేంద్రం కుట్ర: ఒవైసీ

వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తగ్గేదే లేదని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. హైదరాబాద్ దారుసలాంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కొట్టేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్రం నిర్ణయంతో ముస్లింల సమాధులకూ స్థలాలు ఉండబోవని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30 నుంచి నిరసనలు చేపడతామన్నారు.
News April 20, 2025
DSC: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రకాశం జిల్లాలో 72 ఎస్ఏ పీఈటీ, 106 ఎస్జీటీ పోస్టులతో కలిపి మొత్తం 629 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి 26 ఎస్జీటీ పోస్టులతో కలిపి జిల్లాలో 43 పోస్టులు ఉన్నాయి.
News April 20, 2025
DSC: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ 10 గంటలకు మెగా DSC నోటిఫికేషన్ వెలువడనుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ➱SA LANG-1: 14, ➱HINDI: 14, ➱ENG: 23, ➱MATHS: 08, ➱PS: 32, ➱BS: 20, ➱SOCIAL: 62, ➱PE:63, ➱SGT: 210, ➱TOTAL: 446 ఉన్నాయి. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ➱ENG:07, ➱MATHS:25, ➱PS:24, ➱BS:16, ➱SOCIAL:05, ➱SGT: 60, ➱TOTAL:137 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.