News March 26, 2024
రోడ్డుపై పసికందు.. వారిపైనే అనుమానం!
చండూరు పరిధిలోని బంగారిగడ్డలో ఓ పసికందును పడవేసిన ఘటన కలకలం సృష్టించింది. అయితే ఇది అవివాహితులు ఎక్కడో ప్రసవించి ఇక్కడ వదిలివేసి వెళ్లినట్లు ICDS అధికారులు అనుమానిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.
Similar News
News January 10, 2025
NLG: ఈ ఆలయాలకు వెళ్తున్నారా మీరు!
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి NLG జిల్లాల పరిధిలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున రానున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ క్షేత్రాలైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి, సూర్యాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి, నల్గొండ సీతారామచంద్ర స్వామి, పానగల్లు ఛాయా సోమేశ్వర ఆలయాలతో పాటు వాడవాడలో ఉన్న వైష్ణవ ఆలయాల్లో నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
News January 9, 2025
చౌటుప్పల్: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్
చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న భార్యభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు దంపతులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 9, 2025
డిండి: ఆకతాయిలతో కోర్టు ఆవరణం శుభ్రం చేయించారు
కందుకూరులో ఇటీవల మద్యం సేవించి ఓ వ్యక్తిపై అకారణంగా దాడికి ప్రయత్నించి అలజడి సృష్టించిన కోక అభిషేక్, జోసెఫ్, శివాజీపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఎదుట బుధవారం ప్రవేశపెట్టారు. ముగ్గురు ఆకతాయిలు ఒక్కరోజు శిక్షలో భాగంగా కమ్యూనిటీ సర్వీస్ కింద కోర్టు ఆవరణం శుభ్రం చేయాల్సిందిగా స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ పొట్ట చెన్నయ్య ఆదేశించారని ఎస్సై రాజు అన్నారు. వారితో శిక్షను అమలు చేశామన్నారు.