News February 3, 2025

రోడ్డు ప్రమాదంలో అల్లూరి వాసి మృతి

image

బైక్‌ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ ప్రమాదం కుక్కునూరు మండలం నెమలిపేటలో సోమవారం సాయంత్రం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వేలేరుపాడు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన వీరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా లోప ఐతమ్ రాజుల శ్రీనివాస్ మృతి చెందాడు.

Similar News

News November 19, 2025

సింహాద్రిపురం: అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

image

సింహాద్రిపురం మండలంలోని బిందెనంచెర్ల చెందిన ముత్తులూరు పెద్దిరెడ్డి(47) అనే చీని అన్నదాత మంగళవారం చెరువుకట్ట వద్దకు వెళ్లి విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రైతుకు ఐదు ఎకరాల చీనీ తోట ఉంది. పంట సాగుకు, కుటుంబ అవసరాలకు రూ.20 లక్షలు అప్పులు చేశాడు. చీనీ కాయలకు ధరలు లేకపోవడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News November 19, 2025

లొంగిపోయేందుకు సిద్ధమైన హిడ్మా!

image

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన హిడ్మా నవంబర్ 10న రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ లోకల్ జర్నలిస్టుకు ఈ లెటర్ రాసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ‘జోహార్.. మొత్తం పార్టీ లొంగిపోయేందుకు సిద్ధంగా లేదు. సెక్యూరిటీ రిస్కులతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మా భద్రతకు హామీ ఇస్తే ఎవరినైనా (లొంగిపోయేందుకు) కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం లొకేషన్ నిర్ణయించాలి’ అని లేఖలో ఉన్నట్లు పేర్కొంది.

News November 19, 2025

నాగర్‌కర్నూల్‌లో పెరిగిన చలి

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెల్దండ మండలం బొల్లంపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 13.2గా నమోదైంది. అమ్రాబాద్, తోటపల్లిలో 13.9, సిర్సనగండ్లలో 14.1 ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో అధిక చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.