News February 3, 2025

రోడ్డు ప్రమాదంలో అల్లూరి వాసి మృతి

image

బైక్‌ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ ప్రమాదం కుక్కునూరు మండలం నెమలిపేటలో సోమవారం సాయంత్రం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వేలేరుపాడు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన వీరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా లోప ఐతమ్ రాజుల శ్రీనివాస్ మృతి చెందాడు.

Similar News

News January 19, 2026

పోలీస్ PGRSకు 27 అర్జీలు: ఎస్పీ రాహుల్ మీనా

image

అమలాపురంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో జరిగిన పీజీఆర్ఎస్ (PGRS) కార్యక్రమానికి 27 ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ, సమస్యలను చట్టపరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

News January 19, 2026

జగిత్యాల: సర్పంచ్‌ల శిక్షణా తరగతులు ప్రారంభం

image

జగిత్యాల జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ల కోసం ఉద్దేశించిన శిక్షణా తరగతులు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. నూకపల్లిలోని NAC సెంటర్‌లో 7 మండలాల సర్పంచ్‌లకు 5 రోజుల పాటు జరిగే ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి మదన్ మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పంచాయతీ పాలన, నిధుల వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. మొదటివిడత మండలాల సర్పంచ్‌లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

News January 19, 2026

ఏలూరు: ‘పబ్లిక్ గ్రీవెన్స్‌కు 35 అర్జీలు’

image

ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్‌కు 35 అర్జీలు అందాయని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పేపర్‌ లెస్ పద్ధతిలో నిర్వహించామన్నారు. ఆన్‌ లైన్ ద్వారా ఫిర్యాదులు చేయాలనుకునే వారు https://meekosam.ap.gov.in వెబ్‌సైట్‌‌ను ఉపయోగించుకోవాలని సూచించారు.