News February 27, 2025
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

రొద్దం మండల సమీపంలోని దొమ్మత మర్రివద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంలో రెడ్డి పల్లి నుంచి లేపాక్షికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించగా తిరుమలేశ్, భరత్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 19, 2025
కడప: రేపు పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు

దీపావళి పండుగ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ తెలిపారు. అర్జీదారులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
News October 19, 2025
అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని APSDMA తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో అది వాయుగుండంగా బలపడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది.
News October 19, 2025
విద్యుత్ కాంతులతో ముస్తాబైన కలెక్టరేట్

దీపావళి పర్వదినం సందర్భంగా కలెక్టర్ కార్యాలయాన్ని అధికారులు విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలో కలెక్టరేట్ కార్యాలయం విద్యుత్ దీప కాంతులతో విరజిల్లుతోంది. అంతకుముందు కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపి, జాగ్రత్తలు పాటిస్తూ టపాసులు పేల్చాలని సూచనలు చేశారు.