News March 7, 2025

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నెల్లూరు యువకులు దుర్మరణం

image

చెన్నైలో చదువుకుంటున్న స్నేహితుడిని చూసేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై నెల్లూరుకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. న్యాయవాది గుడుగుంట వేణుగోపాల్ కుమారుడు శ్రేయాశ్‌తో పాటు ప్రముఖ ట్రాన్స్‌పోర్టర్ అధినేత కుమారుడు ధనిశ్ రెడ్డి చెన్నైలో కారులో వెళ్తూ లారీని ఢీకొన్నారు. దీంతో స్నేహితులిద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణంతో నెల్లూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 9, 2025

నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీద రవిచంద్ర

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీద రవిచంద్ర పేరును టీడీపీ ఖరారు చేసింది. ఈయన కావలి నియోజకవర్గం అల్లూరు(M) ఇస్కపల్లిలో జన్మించారు. గతంలో ఆయన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, ఆక్వా అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈయన సోదరుడు బీద మస్తాన్‌‌రావు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.

News March 9, 2025

నెల్లూరులో నేడు పవర్ కట్

image

నెల్లూరులోని పలు ప్రాంతాలలో మరికాసేపట్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతుల నేపథ్యంలో పినాకినీ అవెన్యూ, ఆకుతోట హరిజనవాడ, సర్వేపల్లి కాలువకట్ట, చిల్డ్రన్ పార్క్, అయోధ్యా నగర్, మధురా నగర్, అపోలో ఆస్పత్రి ప్రాంతాలలో ఉదయం 8 నుంచి మ.1గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

News March 9, 2025

నెల్లూరు : మాజీ‌ ఛైర్మన్ ఇక లేరు

image

నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేత, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం మాజీ ఛైర్మన్, కొచ్చిన్, గోవా పోర్టు ట్రస్ట్ మాజీ సభ్యులు పత్తి రవీంద్రబాబు అనారోగ్య సమస్యల కారణంగా శనివారం రాత్రి  మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఆయన పలు పదవులను పొంది పలువురి మన్ననలు కూడా అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

error: Content is protected !!