News February 9, 2025

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి..తల్లికి సీరియస్

image

ఆకివీడు శివారు దుంపగడప వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కలిదిండి మండలం చినతడినాడకు చెందిన కొల్లాటి వెంకట యువరాజు (28) మృతి చెందాడు. మృతుడు తల్లితో కలిసి ఆకివీడులో జరుగుతున్న క్రైస్తవ మహాసభలకు హాజరై బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా కైకలూరు-ఆకివీడు వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువరాజు మృతి చెందాడు. అతని తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 26, 2025

బండవతపురంలో రిజర్వేషన్ గందరగోళం

image

WGL జిల్లా వర్ధన్నపేట మండలం బండవతపురం గ్రామంలో మొత్తం 1,550 ఓట్లు ఉండగా సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయించారు. గ్రామంలో 10 వార్డుల్లో 5 జనరల్, 5 ఎస్సీ రిజర్వ్ చేశారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్క వార్డూ బీసీ కేటగిరీకి రాకపోవడంతో గ్రామ రాజకీయాలు వేడెక్కాయి. బీసీ ఓటర్లు ఉన్నచోట ఎస్సీ, ఎస్సీ ఓటర్లు ఉన్నచోట జనరల్ వార్డులు రావడం గందరగోళానికి దారి తీసింది. దీంతో నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంది.

జాతీయ స్థాయిలో కర్నూలుకు పతకాలు

image

ఈనెల 21 నుంచి 24 వరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో జరిగిన 8వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల(క్యాడెట్ విభాగం-అండర్ 45)లో జిల్లా క్రీడాకారులు కార్తీక్ ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు శిక్షకుడు సతీశ్ తెలిపారు. మరో క్రీడాకారిణి గాయత్రి 41వ సీనియర్ అండర్-53 విభాగంలో రన్నర్‌గా నిలిచారన్నారు. వారిని మంగళవారం ఘనంగా సత్కరించారు.