News June 22, 2024
రోడ్డు ప్రమాదంలో తిరుపతి వాసులు ఇద్దరు మృతి
తిరువన్నామలై దర్శనం కోసం వెళ్తున్న తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్, రెడ్డిగుంటకు చెందిన భక్తుల బృందానికి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరో ఎనిమిది మంది గాయాలయి తిరువన్నామలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ప్రాథమిక సమాచారం. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 8, 2024
చిత్తూరు: అమ్మమ్మపై అత్యాచారం.. 34 ఏళ్లు జైలు శిక్ష
తంబళ్లపల్లి సద్దిగుట్టవారిపల్లెలో 2018లో తన అమ్మమ్మపై అత్యాచారం చేసి, అతి కిరాతకంగా చంపిన ఇంద్రప్రసాద్(38) అనే ముద్దాయికి 34 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ 6 వ అదనపు జడ్జ్ శాంతి గురువారం తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోట పురుషోత్తం వృద్ధురాలు తరపున కేసును వాదించారు. అత్యాచారం చేసినందుకు 20 ఏళ్లు, చంపినందుకు 14 ఏళ్లు జైలు శిక్ష విధించారు.
News November 8, 2024
పలమనేరు: నూతన సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలి
నూతన బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ స్వామి తెలిపారు. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసులు పలమనేరు నుంచి బెంగుళూరుకు వెళ్లేందుకు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి చొరవతో ఉన్నతాధికారులు ప్రత్యేక బస్సులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.
News November 8, 2024
యాదమరి: కౌశల్ పోటి గోడపత్రిక ఆవిష్కరించిన కలెక్టర్
కౌశల్ క్విజ్ , పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల గోడ పత్రికను యాదమరి కె. గొల్లపల్లి పాఠశాలలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు. కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20,21,22 పాఠశాల స్థాయిలో, డిసెంబర్ 6న జిల్లా స్థాయిలో, 29,30 న రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. అనంతరం డిఇఓ వరలక్ష్మి చేతుల మీదుగా ఆమె చాంబర్లో ఆవిష్కరించారు.