News December 22, 2024
రోడ్డు ప్రమాదంలో నర్సు మృతి
దోర్నాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీశైల దేవస్థానం వైద్యశాల నర్సు మల్లిక మృతి చెందారు. శ్రీశైలానికి చెందిన ఆమె.. భర్త, పాపతో కలిసి కర్నూలుకు షాపింగ్ నిమిత్తం నిన్న వెళ్లారు. రాత్రి పుష్ప-2 సినిమా చూసి, తిరుగు పయనమయ్యారు. తెల్లవారుజామున మంచు కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు టూరిస్ట్ బస్సును ఢీకొంది. మల్లిక అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త, పాపకు ఏమీ కాలేదని వారి సన్నిహితులు తెలిపారు.
Similar News
News January 16, 2025
ఉపాధి వేతన దారులకు పనులు కల్పించండి: కలెక్టర్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామపంచాయతీలో ప్రతిరోజు వంద మంది ఉపాధి వేతనదారులకు పనులు కల్పించి నిర్దేశించిన లేబర్ బడ్జెట్ మొబిలైజేషన్ లక్ష్యాన్ని సాధించాలని అధికారులను కలెక్టర్ జీ.రాజకుమారి ఆదేశించారు. గురువారం నంద్యాల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లేబర్ బడ్జెట్, హౌసింగ్ మ్యాండేస్, సచివాలయ సర్వీసులపై సమీక్షించారు.
News January 16, 2025
ఏపీ బీజేపీ చీఫ్ రేసులో ఆదోని ఎమ్మెల్యే!
ఏపీ బీజేపీకి త్వరలో కొత్త చీఫ్‌ను ప్రకటించే ఛాన్సుంది. సుమారు 20మంది నేతలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఆదోని MLA పార్థసారథి సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బీజేపీ సీనియర్, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులతో సమావేశమైనట్లు సమాచారం. ఈ నెల 19న విజయవాడలో నిర్వహించే సమావేశంలో అధ్యక్షుడి ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ నెలాఖరుకు కొత్త చీఫ్‌ను ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
News January 16, 2025
కర్నూలు జిల్లాలో అనిల్ అంబానీ భారీ పెట్టుబడి!
కర్నూలు జిల్లాకు మరో భారీ పెట్టుబడి రానుంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కర్నూలులో కాంపోజిట్ ఫెసిలిటీపై రూ.10వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే జిల్లాలో అనువైన భూములను పరిశీలించినట్లు సమాచారం. త్వరలోనే ఒక ప్లేస్‌ను ఫైనల్ చేసి పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశ నుంచే సుమారు 6వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.