News November 17, 2024

రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ వాసి మృతి

image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదర్శనగర్ మలుపు వద్ద ఓ కారు కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో NZB జిల్లా డిచ్పల్లికి చెందిన సురేశ్ స్పాట్‌లో మృతిచెందగా, కుత్బుల్లాపూర్‌కు చెందిన నరసింహారావు, శివకుమార్ సంగారెడ్డిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వారు ముగ్గురు కలిసి కారులో మహారాష్ట్రలోని గానుగాపూర్‌ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News March 15, 2026

NZB: వారం రోజుల్లో 230 కేసులు: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో (9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు) 230 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం తెలిపారు. 230 మందిని కోర్టులో హాజరు పరచగా రూ.21.60 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే 14 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని CP వివరించారు.

News March 15, 2026

NZB: హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

image

నిజామాబాద్ జిల్లాలోని 340 మంది హజ్ యాత్రికులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ తెలిపారు. శనివారం జీజీహెచ్‌‌లో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. అనంతరం ఈ నెల 23న యాత్రికులకు ముందుజాగ్రత్తగా ఇన్ఫ్లుఎంజా, న్యూమోకొకల్ వంటి టీకాలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు.