News March 14, 2025
రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు వాసి మృతి

రాజమండ్రి మోరంపూడి ఫ్లై ఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు(M) గొల్లవాని చెరువుకు చెందిన సాయినరేశ్ (30) మృతి చెందాడు. గుంటూరు జిల్లాకు చెందిన రమేశ్ తో బొమ్మూరు వైపు వెళ్తుండగా.. వెనుకనుంచి కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని గురువారం కుటుంబీకులకు బొమ్మూరు పోలీసులు అప్పగించి, కేసు నమోదు చేశారు. నరేశ్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.
Similar News
News December 9, 2025
ఈ కమిషనర్ మాకొద్దు: నరసాపురం కౌన్సిల్ ఫిర్యాదు

నరసాపురం మున్సిపల్ కమిషనర్ అంజయ్యను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని మునిసిపల్ చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకట రమణతో పాటు వైసీపీ కౌన్సిల్ సభ్యులు జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి PGRSలో ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పనులకు కౌన్సిల్ తీర్మానం చేసినా పట్టించుకోవట్లేదని, అవినీతి ఆరోపణలు వంటి కారణాల వల్ల ఆయనను సరెండర్ చేయాలని కౌన్సిల్ తీర్మానించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తీర్మాన పత్రాన్ని జేసీకి అందించారు.
News December 9, 2025
ప.గో జిల్లా మొత్తం 8 పరీక్షా కేంద్రాలు

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం 5, నరసాపురం 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
News December 9, 2025
‘పరీక్షా పే చర్చ’.. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం

‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పశ్చిమ, ఏలూరు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. పశ్చిమ గోదావరికి ఎం.విజయప్రసన్న, బి.జాన్సన్లు, ఏలూరు జిల్లాకు వై.స్వరాజ్యశ్రీనివాస్, సీహెచ్ గోవిందరాజులు, శామ్యూల్ సంజీవ్లు ఎంపికయ్యారు. ఈనెల 11వ తేదీ వరకు జరిగే రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించాలని ఆమె సూచించారు.


