News June 11, 2024
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం

బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కలువాయి మండలానికి చెందిన డిస్కం ఏఈ యశ్వంత్(26) మృతి చెందాడు. స్థానికులు వివరాల ప్రకారం.. యశ్వంత్ రెండు రోజుల క్రితం బెంగళూరు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇతని కుటుంబ సభ్యులు నెల్లూరులో నివాసముంటున్నారు.
Similar News
News December 16, 2025
నెల్లూరు: రైలు కిందపడి వ్యక్తి మృతి

రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి నెల్లూరు విజయమహల్ వద్ద జరిగింది. విజయవాడ వైపు వెళ్లే గుర్తు తెలియని రైలులో నుంచి గుర్తు తెలియని వ్యక్తి జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందినట్లు నెల్లూరు రైల్వే SI హరిచందన తెలిపారు. అతడు ఎరుపు రంగు ఆఫ్ హాండ్స్ టీ షర్టు, సిమెంట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని, వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుందన్నారు.
News December 15, 2025
ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించండి: సుభాష్

రాష్ట్రంలోని బీసీ ప్రభుత్వ హాస్టళ్లలో ఉన్న తీవ్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దులూరు సుభాష్ యాదవ్ కోరారు. ఈమేరకు విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ చంద్రశేఖర్ రాజుకి వినతిపత్రం సమర్పించారు. భవనాల దుస్థితి, నాసిరక ఆహారం, వార్డెన్ల కొరత, స్కాలర్షిప్ల ఆలస్యం, గర్ల్స్ హాస్టళ్లలో భద్రతా లోపం వంటి అనేక సమస్యలు ఉన్నాయని, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
News December 15, 2025
కాకాణి రిట్ పిటిషన్పై హైకోర్టు స్పందన

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో తనపై నమోదు చేసిన కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖాలు చేశారు. గతంలో దీనిపై సీబీఐ విచారణ చేయించాలని సీఎంకు లేఖ రాసినా స్పందించలేదన్నారు. దీనిపై నోటీసులు జారీ చేసి.. ప్రతివాదుల స్పందన అనంతరం విచారణ చేపట్టి తగు నిర్ణయం తీసుకొనేందుకు హైకోర్ట్ 8 వారాలు వాయిదా వేసినట్లు కాకాణి ఒక ప్రకటనలో తెలిపారు.


