News February 22, 2025
రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ వాసి మృతి

రోడ్డుప్రమాదంలో బాన్సువాడ వాసి మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. బాన్సువాడ మండలం వినాయకనగర్ కాలనీకి చెందిన సందీప్(33)
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్లే క్రమంలో బైక్ అదుపుతప్పి ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో సందీప్ అక్కడికక్కడే మృతిచెందారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News March 21, 2025
ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్

రబీ సీజన్లో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో 2024-25 రబీ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత అంచనా ప్రకారం రబీ సీజన్ కు సంబంధించి 1,85,000 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, 73,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, మొత్తం 2,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబోతున్నామన్నారు.
News March 21, 2025
నల్లబెల్లి: తల్లిదండ్రుల కల నెరవేర్చిన కుమారుడు

తల్లిదండ్రుల కలను ఓ కుమారుడు నెరవేర్చాడు. నల్లబెల్లి మండల పరిధిలో నిరుపేద కుటుంబానికి చెందిన మొగిలి, పద్మ దంపతుల కుమారుడు బొట్ల కార్తీక్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 2023 టీఎస్పీఎస్పీ సివిల్ ఇంజినీరింగ్ పరీక్షలో భద్రాద్రి జోన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వరంగల్ జిల్లా టెక్నికల్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు.
News March 21, 2025
అవి తీసుకురాకండి: వనపర్తి జిల్లా కలెక్టర్

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 8:30 గంటల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ సూచించారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ వెంట తెచ్చుకోవాలని, స్మార్ట్ వాచ్‌లు, మొబైల్ ఫోన్లు వంటివి తీసుకురావద్దని సూచించారు.