News March 12, 2025
రోడ్డు ప్రమాదంలో మండపేట యువకుడు మృతి

మహరాష్ట్రలో పనికోసం వెళ్లిన మండపేట యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలు.. నగరంలోని కొండపల్లివారి వీధికి చెందిన జితేంద్ర(33) ఉద్గార్లోని ఓ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈనెల 7న బైక్పై మహరాష్ట్రలోని హల్నీ రోడ్డుపై వెళ్తుండగా ఓ గూడ్స్వ్యాన్ ఢీకొట్టింది. గాయపడిన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
Similar News
News November 16, 2025
WOW.. చీమ కాలుపైనున్న వెంట్రుకలను కూడా గుర్తించే లెన్స్!

జార్జియా టెక్ శాస్త్రవేత్తలు విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే PHySL అనే విప్లవాత్మక సాఫ్ట్ రోబోటిక్ లెన్స్ను సృష్టించారు. చీమ కాలుపై వెంట్రుకలను కూడా గుర్తించగలిగే సామర్థ్యం దీనికుందని చెబుతున్నారు. 4 మైక్రోమీటర్ల వెడల్పున్న అతి చిన్న వస్తువులను సైతం దీంతో స్పష్టంగా చూడొచ్చంటున్నారు. సర్జికల్ రోబోట్లు, వైద్యం, వ్యవసాయంతో సహా అనేక రంగాలలో ఈ సాంకేతికత అద్భుతమైన మార్పులు తీసుకొస్తుందని తెలిపారు.
News November 16, 2025
పొద్దుతిరుగుడు విత్తనాలను ఇలా నాటితే మేలు

పొద్దుతిరుగుడు సాగు చేసే రైతులు బోదెలు చేసి విత్తనం నాటినట్లైతే నీటితడులు ఇవ్వడానికి, ఎరువులను వేయుటకు అనుకూలంగా ఉండటమే కాకుండా మొక్కకు పటుత్వం కూడా లభిస్తుంది. నేల స్వభావాన్ని బట్టి విత్తే దూరం నిర్ణయించాలి. తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెం.మీ. మరియు మొక్కల మధ్య 20-25 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. బరువైన నేలల్లో వరుసల మధ్య 60 సెం.మీ. మరియు మొక్కల మధ్య 30 సెం.మీ. దూరంలో విత్తాలి.
News November 16, 2025
కర్ణాటకలో మిస్సింగ్.. కుప్పంలో డెడ్ బాడీ

కర్ణాటక అత్తిబెలే సమీపంలో మిస్సయిన శ్రీనాథ్ డెడ్ బాడీ కుప్పంలో పూడ్చిపెట్టినట్లు కర్ణాటక పోలీసులు గుర్తించారు. కుప్పం ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ అత్తిబెలే వద్ద నివాసం ఉంటుండగా గత నెల 27 నుంచి కనబడడం లేదంటూ కుటుంబ సభ్యులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకుప్పం(M) ముద్దునపల్లికి చెందిన ప్రభాకర్ను అదుపులోకి తీసుకోగా మృతదేహాన్ని జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో పూడ్చిపెట్టినట్లు గుర్తించారు.


