News April 4, 2025

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

ఏలూరు జిల్లా భీమడోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపాలపురం పెద్దగూడెంకు చెందిన యువకుడు సుబ్రహ్మణ్యం(22) మృతిచెందాడు. మార్చి 21న ఇద్దరు స్నేహితులు బైక్ పై వెళ్తుండగా ఎదురుగా కారు వచ్చి ఢీ కొట్టింది. ఘటనలో బైక్ నడుపుతున్న యువకుడు అదే రోజు మరణించాడు. గోపాలపురంకు చెందిన సుబ్రహ్మణ్యం విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు శుక్రవారం అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News November 8, 2025

తాళ్లపూడి: యాసిడ్ పడి ఇద్దరికి గాయాలు

image

తాళ్లపూడి మండలం పైడిమెట్టలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గోతులమయమైన రహదారిపై వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ నుంచి కుదుపులకు యాసిడ్ లీకైంది. అది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పడటంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

News November 8, 2025

రేపు రాజమండ్రిలో ఉద్యోగమేళా

image

మెప్మా, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 9న (ఆదివారం) రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనక రాజు శనివారం తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ నుంచి పీజీ, బీటెక్, నర్సింగ్ చేసిన వారు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

News November 8, 2025

ఈనెల 10న యథాతధంగా పీజీఆర్ఎస్‌: కలెక్టర్

image

పీజీఆర్ఎస్‌ కార్యక్రమం ఈనెల 10 సోమవారం యథాతధంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వ్యయప్రయాసలకు గురి కాకుండా తమ డివిజన్‌, మండల కేంద్రాలు, గ్రామ-వార్డు సచివాలయాల్లోనే అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. అలాగే 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఫిర్యాదులు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.