News August 1, 2024
రోడ్డు ప్రమాదంలో విజయనగరం వాసులు
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం పెట్రోల్ బంక్ వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. షిరిడి నుంచి మైలవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా వాసులుగా సమాచారం. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 12, 2024
ఉమ్మడి జిల్లాలో 6,426 దరఖాస్తులు
ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొత్త షాప్‌ల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణలో కిక్కు ఎక్కించే ఉమ్మడి జిల్లాలో ఊహించని రీతిలో దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 205 షాప్‌లకి 6,426 దరఖాస్తులు దాఖలు రాగా రూ.128.52 కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో పార్వతీపురంలో 52 షాప్‌లకు 1,376 దరఖాస్తులకు రూ.27.52 కోట్లు ఆదాయం వచ్చింది. విజయనగరం జిల్లాలో 153 షాప్‌లకి 5,050 దరఖాస్తులు రాగా రూ.101 కోట్లు ఆదాయం వచ్చింది.
News October 12, 2024
పార్వతీపురంలో రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి
రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ బాలాజీ తెలిపిన వివరాలు ప్రకారం.. పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న జీ మల్లేశ్వరరావు (37) పట్టణ సమీపంలో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
News October 12, 2024
VZM: చివరి నిమిషంలో పరుగులు తీసిన ప్రయాణికులు
కొత్తవలస రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దసరా నేపథ్యంలో స్పెషల్ ట్రైన్లు వేసిన సంగతి తెలిసిందే. విశాఖ నుంచి అరకు వెళ్లాల్సిన ప్రత్యేక రైలుకు మచిలీపట్నం టూ విశాఖ బోర్డు ఉండడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. తాము ఎక్కాల్సిన ట్రైన్ కాదనుకొని వేచి చూస్తుండగా ప్లాట్ ఫామ్‌పై వ్యాపారాలు చేస్తున్న వారు అరకు రైలు అని చెప్పడంతో ట్రైన్ ఎక్కేందుకు పరుగులు తీశారు.