News February 18, 2025

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిపై కేసు నమోదు: ఎస్సై

image

లారీ ఢీకొని విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన తాడేపల్లిగూడెం మండలంలోని పెదతాడేపల్లిలో సోమవారం జరిగింది. ముత్యాలంబపురం గ్రామానికి చెందిన పప్పు సంజీవరావు(64) పొలం పనులు ముగించుకుని బైక్‌పై వస్తుండగా పెదతాడేపల్లి వద్ద వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.

Similar News

News April 17, 2026

ప.గో: జీతాలు రాక హోంగార్డుల పరేషాన్!

image

జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు గత 15 రోజులుగా జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 190 మంది హోంగార్డులకు సుమారు రూ.40 లక్షల వేతనాలు చెల్లించాల్సి ఉంది. అంకితభావంతో పనిచేస్తున్న తమపై అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని, కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి జీతాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News April 17, 2026

గుర్రపుడెక్కతో మహిళలకు ఉపాధి: కలెక్టర్ నాగరాణి

image

కాలువలు, డ్రైన్ల నుంచి గుర్రపుడెక్కను సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. ఈ వినూత్న కార్యక్రమం వల్ల అటు డ్రైన్ల ప్రక్షాళనతో పాటు ఇటు మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, డ్వామా పీడీలు పాల్గొన్నారు.