News March 12, 2025

రోడ్డు ప్రమాదంలో సుంకరపాలెం యువకుడు మృతి

image

ఐ.పోలవరం (M) బాలయోగి వారధిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తాళ్లరేవు మండలం సుంకరపాలెనికి చెందిన వేళ్ల వీరేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. సుంకరపాలెం నుంచి ముమ్మిడివరం వైపు బైకుపై వస్తున్న అతడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News November 25, 2025

KMR: ఎన్నికల్లో మహిళలే కీలకం

image

కామారెడ్డి జిల్లాలో 25 మండలాల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం 6,39,730 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో 3,07,508 మంది పురుషులు కాగా, 3,32,209 మంది మహిళలు ఉన్నారు. మరో 13 మంది ఇతరులు ఉన్నారు. ఈ లెక్కన పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలక పాత్ర పోషించనున్నారు.

News November 25, 2025

ములుగు: చేయూత పెన్షన్ వివరాలు

image

జిల్లాలో చేయూత పెన్షన్ లబ్ధిదారుల వివరాలు వృద్ధాప్య 15,338 (రూ.3.09కోట్లు), వితంతు 16,440 (రూ.3.31కోట్లు), ఒంటరి మహిళ 1,516 (0.30కోట్లు), కల్లుగీత కార్మికులు 217 (రూ.0.44కోట్లు), బీడీ కార్మికులు 91 (రూ.0.02 కోట్లు), బోదకాలు 39 (రూ.0.08 కోట్లు), డయాలసిస్ 28 (రూ.0.06 కోట్లు), దివ్యాంగులు 3,869 (రూ.1.55 కోట్లు), చేనేత 205 (రూ.0.41 కోట్లు) అందజేస్తున్నారు.

News November 25, 2025

పెద్దపల్లిలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం

image

RGM సీపీ ఆదేశాలపై PDPLలోని ఒక కాలేజీలో పెద్దపల్లి షీ టీమ్ అవగాహన సదస్సు నిర్వహించింది. ఇన్‌ఛార్జ్ SI లావణ్య మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్‌పై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. వేధింపులపై 6303923700, సైబర్ మోసాలపై 1930, అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలన్నారు. బస్టాండ్, ప్రధాన చౌరస్తాల్లో రెగ్యులర్ పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.