News February 8, 2025
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

<<15391662>>కర్మకు వెళ్లి వస్తుండగా<<>> బూడిదంపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో వీరబాబు, విజయ్ మృతి చెందిన విషయం తెలిసిందే. విజయ్‌కు భార్య, 3 కుమారులు, వీరబాబుకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరబాబు మొదటి భార్యకు కుమార్తె జన్మించాక 8ఏళ్ల క్రితం కన్నుమూయడంతో మరో వివాహం చేసుకున్నాడు. కుమార్తెకు పెళ్లి నిశ్చయం కాగా ఇటీవలే ముహూర్తాలు కూడా ఖరారు చేసుకున్నారు. ఇంతలోనే ఆయన మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News December 3, 2025
ఐబొమ్మ రవికి బంపరాఫర్?

ఐబొమ్మ రవి కేసులో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అతడి తెలివితేటలకు ఆశ్చర్యపోయిన పోలీసులు సైబర్ క్రైమ్‌లో ఉద్యోగం ఆఫర్ చేశారని, దానిని రవి తిరస్కరించాడని వార్త సారాంశం. అంతేకాకుండా కరీబియన్ దీవుల్లోనే ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ పెడుతానని విచారణలో చెప్పినట్లు సమాచారం. వచ్చిన డబ్బుతో లైఫ్ జాలీగా గడపడమే తన లక్ష్యమని చెప్పాడని తెలుస్తోంది. కాగా త్వరలో అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని టాక్.
News December 3, 2025
పలు జిల్లాలకు వర్షసూచన

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో నేడు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News December 3, 2025
ఏపీలో ఫిలిం టూరిజానికి మాస్టర్ ప్లాన్: మంత్రి దుర్గేష్

ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్మ్ టూరిజానికి ప్రోత్సాహం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ప్రకటించారు. ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. విశాఖ బీచ్‌లు, గోదావరి నదీ తీరాలు, అరకు, లంబసింగి, తిరుపతి, శ్రీశైలం వంటి ప్రదేశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.


