News April 15, 2025
రోడ్డు ప్రమాదం.. కోమాలోకి వెళ్లిన మహానంది కానిస్టేబుల్

ఒంటిమిట్ట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మహానంది PSలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సునీల్ కుమార్ నాయుడికి తీవ్ర గాయాలైనట్లు మహానంది పోలీసులు తెలిపారు. సోమవారం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్న ఆయనకు ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి <<16098474>>కోమాలోకి వెళ్లారని<<>> కడప రిమ్స్లో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.
Similar News
News November 14, 2025
సాక్షి మృతి.. అదే ఫార్ములా రిపీట్: TDP

TTD మాజీ AVSO సతీశ్ మృతిపై TDP చేసిన వరుస ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ‘కేసులో సాక్షి గల్లంతైతే నేర నిరూపితం కష్టమే. అందుకేనేమో కేసు కొలిక్కి వస్తుందనుకున్న టైంలో సాక్షి చచ్చిపోతాడు. పరిటాల రవి కేసు నుంచి పరకామణి కేసు వరకు అదే ఫార్ములా రిపీట్. నాడు బాబాయ్ వివేకానంద రెడ్డిపై గొడ్డలి వేటు వేసి గుండెపోటు అని, నేడు మాజీ AVSOని చంపేసి బలవన్మరణం అని YCP ప్రచారం చేస్తోంది’ అని TDP ఆరోపించింది.
News November 14, 2025
వివాహం గురించి వేదాలేమంటున్నాయి?

పెళ్లంటే నూరేళ్ల పంట. వివాహం కుటుంబ వ్యవస్థకు ప్రధానమైన ఆధారం. ఇది గృహస్థాశ్రమ ధర్మానికి నాంది. మన మేధో వికాసానికి, సామాజిక ఎదుగుదలకు ఇది అత్యంత ముఖ్యమైనదని వేదాలు కూడా చెబుతున్నాయి. ఈ పవిత్ర వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచమంతా కొనియాడుతుంది. వివాహం ద్వారానే సంస్కృతికి, సమాజానికి పునాది పడుతుంది. అందుకే ఈ బంధాన్ని పవిత్రంగా గౌరవించాలి. ఈ బంధం రేపటి తరానికి ఉత్తమమైన వారసత్వాన్ని అందిస్తుంది. <<-se>>#Pendli<<>>
News November 14, 2025
ఆర్చరీలో సత్తా చాటిన తెలుగు కుర్రాడు

ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర(VJA) చరిత్ర సృష్టించారు. వ్యక్తిగత విభాగంలో రాహుల్(IND)పై 6-2 తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ సాధించారు. మహిళల విభాగంలో అంకితా భకత్ 7-3 తేడాతో సౌ.కొరియా ఆర్చర్ నామ్ సు-హ్యోన్పై నెగ్గి గోల్డ్ గెలిచారు. ఏషియన్ రికర్వ్ ఆర్చరీలో INDకు ఇవే తొలి వ్యక్తిగత గోల్డ్ మెడల్స్ కావడం విశేషం. ఈ టోర్నీలో IND 6 గోల్డ్, 3 సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ నెగ్గింది.


