News January 31, 2025
రోడ్డు ప్రమాదం.. ధర్మపురి వాసి మృతి

చొప్పదండి నవోదయ స్కూల్ వద్ద శుక్రవారం జరిగిన బైక్ ప్రమాదంలో ధర్మపురికి చెందిన పసుపునుటి భారతి (60) అనే మహిళ మృతి చెందింది. భారతి తన కుమారుడు చంద్రశేఖర్ తో కరీంనగర్ వైపు బైక్పై వస్తుండగా హఠాత్తుగా మేక అడ్డు రావడంతో సడేన్ బ్రేకు వేశాడు. దీంతో రోడ్డుపై పడిన భారతికి తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందింది. చొప్పదండి ఎస్ఐ గొల్లపల్లి అనూష కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 17, 2025
భారత్ మౌనంగా ఉండదు: మోదీ

కొవిడ్ తర్వాత ప్రపంచంలో వరుస యుద్ధాలు, ఉద్రిక్తతలు కొనసాగినా భారత్ అభివృద్ధిలో ముందుకెళ్లిందని ప్రధాని మోదీ NDTV సమ్మిట్లో అన్నారు. సగటున 7.8% వృద్ధిరేటు సాధిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై దేశం మౌనంగా ఉండదని.. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ రూపంలో వారికి గట్టిగా బదులిచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం బ్యాంకింగ్ సెక్టార్లో సంస్కరణలు తెచ్చిందని వివరించారు.
News October 17, 2025
సీఎం అభినందనలు అందుకున్న నక్కపల్లి విద్యార్థిని

నక్కపల్లి గర్ల్స్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలిక కె.చైత్రినిని అమరావతిలో సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం అభినందించారు. సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ అనే అంశానికి సంబంధించి నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో చైత్రని అద్భుతమైన పెయింటింగ్ వేసింది. ఈ పెయింటింగ్ రాష్ట్ర స్థాయిలో మన్ననలు పొందటంతో విద్యార్థిని ప్రతిభను సీఎం ప్రశంసించారని ఆర్జేడి విజయభాస్కర్, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి తెలిపారు.
News October 17, 2025
రంగారెడ్డి: స్వీట్ షాప్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్

దీపావళి పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాల్లో జిల్లా ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేపట్టారు. తయారీకి ఉపయోగించే పదార్థాలు, నాణ్యతపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ప్రజలు స్వీట్స్ కొనేముందు వాటి నాణ్యతను గమనించి కొనాలని, తినే పదార్థాల్లో నాణ్యత లోపిస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. జోనల్ ఆఫీసర్ ఖలీల్, జిల్లా అధికారి మనోజ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగన్ పాల్గొన్నారు.