News January 31, 2025

రోడ్డు ప్రమాదం.. ధర్మపురి వాసి మృతి

image

చొప్పదండి నవోదయ స్కూల్ వద్ద శుక్రవారం జరిగిన బైక్ ప్రమాదంలో ధర్మపురికి చెందిన పసుపునుటి భారతి (60) అనే మహిళ మృతి చెందింది. భారతి తన కుమారుడు చంద్రశేఖర్ తో కరీంనగర్ వైపు బైక్‌పై వస్తుండగా హఠాత్తుగా మేక అడ్డు రావడంతో సడేన్ బ్రేకు వేశాడు. దీంతో రోడ్డుపై పడిన భారతికి తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందింది. చొప్పదండి ఎస్‌ఐ గొల్లపల్లి అనూష కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 12, 2025

మెదక్: అప్పులతోనే ప్రముఖ వ్యాపారి ఆత్మహత్య

image

మెదక్ పట్టణంలో ప్రముఖ వ్యాపారి మల్లికార్జున రమేష్ (54) మంగళవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. రమేశ్ పట్టణంలో ఓ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. ఈ సూపర్ మార్కెట్ ద్వారా 100 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారంలో అప్పులు రూ.కోట్లలో పేరుకుపోయాయి. వాటిని తీర్చే మార్గం లేక ఇంటిపై గల పెంట్ హౌస్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

News February 12, 2025

భద్రాద్రి: నిధులు దుర్వినియోగం.. ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్ష

image

భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో రూ.23,89,750 ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై భద్రాచలం జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివనాయక్ మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో అప్పటి పంచాయతీ కార్యదర్శి బత్తిన శ్రీనివాస రావు, సర్పంచ్ ధరావత్ చందునాయక్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని బూర్గంపాడు SI రాజేశ్ తెలిపారు.

error: Content is protected !!