News February 22, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: చిత్తూరు MP

image

చిత్తూరు పార్లమెంటరీ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు ఒక ప్రకటనలో కోరారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో రహదారులు నెత్తురోడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానవ తప్పిదాలతో జరుగుతున్న వరుస ప్రమాదాలతో విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నట్లు చెప్పారు. వాహనదారులు నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలన్నారు.

Similar News

News March 26, 2025

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ.. నిందితుడికి జైలు శిక్ష

image

మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితునికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు పోలీసు అధికారులు బుధవారం తెలిపారు. పట్టణంలోని కట్టమంచికి చెందిన మహేశ్ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇంట్లో పని చేసేవాడు. 2023లో రూ.లక్ష దొంగతనం చేసి పరారయ్యాడు. అప్పట్లో సాంకేతిక ఆధారాలతో మహేశ్‌ను నిందితుడిగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు. ఆరోపణలు రుజువు కావడంతో నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధించారు.

News March 26, 2025

రామకుప్పం: బయట వ్యక్తులకు ప్రవేశం లేదు

image

రామకుప్పంలో ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో బయట వ్యక్తులు ఎవరు గ్రామంలోకి రాకుండా ప్రవేశం నిషేధించినట్లు డీఎస్‌పీ పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సంబంధిత వ్యక్తులకు, ఎంపీటీసీ సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు సహకరించాలన్నారు. అతిక్రమించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 26, 2025

బాత్రూంలో జారిపడ్డ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ?

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఇంటిలోని బాత్రూంలో జారిపడి కుడి చేయికి దెబ్బ తగిలినట్లు సమాచారం. తిరుపతి-రేణిగుంట మార్గంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పెద్దిరెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కుడి చేయికి ఆపరేషన్ జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!