News July 26, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

రహదారులపై ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా రహదారి భద్రతా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారులపై 51 బ్లాక్ స్పాట్స్ గుర్తించామని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ పాల్గొన్నారు.

Similar News

News December 10, 2024

బాలిక మృతి అత్యంత బాధాకరం: మంత్రి బీసీ

image

నందికొట్కూరులో ప్రేమోన్మాది దాడిలో బాలిక మృతి ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాలిక మృతి అత్యంత బాధాకరమని అన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో ఫోన్‌లో మాట్లాడి మంత్రి బీసీ.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా పట్టిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు.

News December 9, 2024

రాయలసీమలో మళ్లీ వర్షాలు

image

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 15 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News December 8, 2024

వెల్దుర్తిలో స్నేహితుల ఆర్థిక సాయం అందజేత

image

వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988 – 89 సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించిన మిత్రులందరికీ కొన్ని రోజుల క్రితం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తోటి మిత్రురాలు తంబల రాజేశ్వరికి రెండు కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతో ఉన్న విషయాన్ని తోటి స్నేహితులు తెలుసుకున్నారు. ఈ మేరకు వారు రూ.20 వేల నగదును సేకరించి ఆదివారం ఆమెకు అందించారు. అనంతరం ఆమె త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థించారు.