News February 26, 2026

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: జిల్లా కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పోలీస్, రవాణా, రహదారులు వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్లపై చెత్త కుప్పలు లేకుండా చూడాలని, అనుమతులు లేకుండా వాహనాల నిలుపుదలపై చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాలకు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా పాల్గొన్నారు.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. NRPTకు 24th Rank

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. NRPT(D)లో రెగ్యులర్ విద్యార్థులు 3,239 మంది పరీక్షలు రాయగా 2,264 మంది పాసై 69.90%తో స్టేట్‌లో 24వ ర్యాంకు సాధించింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 538 మందికి 465 మంది పాసై 86.43%తో 2వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 467 మందికి 162 మంది పాసై 34.69%తో 12వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 21 మందికి 11 మంది పాసై 52.38%తో 16వ ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

GNT: కటకటాల్లోకి సహాయ కమిషనర్.. ఉద్యోగం నుంచి సస్పెండ్

image

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ACB అధికారులు సహాయ కమిషనర్ శాంతిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 7న నిర్వహించిన తనిఖీల్లో రూ. 1.37 కోట్ల అక్రమాస్తులను గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. కోర్టు 21వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆమెను విజయవాడ జైలుకు తరలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 48 గంటలకు పైగా కస్టడీలో ఉన్నందున, ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. ములుగుకు 4వ ర్యాంక్

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ములుగు(D)లో రెగ్యులర్ విద్యార్థులు 1605 మంది పరీక్షలు రాయగా 1318 మంది పాసై 82.34 శాతంతో స్టేట్‌లోనే 4వ ర్యాంక్ వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 223 మందికి 186 మంది పాసై 83.41 శాతంతో 5వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 33 మందికి 17 మంది పాసై 51.52%తో 2వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో ఆరుగురికి ఇద్దరు పాసై 66.67%తో 2వ ర్యాంక్ వచ్చింది.