News August 10, 2024
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి: నాగలక్ష్మి

రోడ్డు ప్రమాదాలు జరిగితే సంబంధిత శాఖలు తనిఖీలు చేసి కారణాలు విశ్లేషించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు వెంటనే కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ జామ్‌లు జరగకుండా అవసరమైన ప్రాంతాల్లో రహదారులపై డివైడర్స్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి భద్రతపై ఆమె సమావేశం నిర్వహించారు.
Similar News
News September 19, 2025
గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు

గుంటూరు జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి గురువారం పలు ప్రాంతాల్లో చినుకులు పడ్డాయి. మొత్తం మీద సగటు వర్షపాతం 4.1 మిల్లీమీటర్లుగా నమోదైంది. పెదనందిపాడు మండలం 15.6 మి.మీ.తో అగ్రస్థానంలో ఉండగా, తుళ్లూరులో కేవలం 1.8 మి.మీ. మాత్రమే పడింది. మంగళగిరి 9.8, తాడికొండ 9.6, కాకుమాను 9.4, చేబ్రోలు 9.2, గుంటూరు పశ్చిమ 9.2, తాడేపల్లిలో 8.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ వర్షాలతో రైతులు కొంత ఊరట పొందారు
News September 19, 2025
సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.
News September 18, 2025
నాగార్జున యూనివర్సిటీలో ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జూలై-2025లో నిర్వహించిన ఎంఎస్సీ II సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. జియాలజీ, నానో బయోటెక్నాలజీ విభాగాల్లో 100% ఉత్తీర్ణత రాగా, మైక్రోబయాలజీ 98.59%, ఆక్వాకల్చర్ 95.45%, ఫుడ్ ప్రాసెసింగ్ 94.74% సాధించాయి. గణితశాస్త్రంలో తక్కువగా 59.17% మాత్రమే ఉత్తీర్ణత నమోదు అయింది. రీవాల్యూషన్ దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ 26.