News September 27, 2024
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Similar News
News October 15, 2024
సూర్యాపేట: ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి: పీఆర్టీయూ
సూర్యాపేట జిల్లాలో అవసరం ఉన్న ప్రతి పాఠశాలకు డీఎస్సీ-2024 అభ్యర్థులతో ఖాళీలను భర్తీ చేయాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేశ్ కోరారు. మంగళవారం డీఎస్సీ 2024 సెలెక్టెడ్ అభ్యర్థుల కౌన్సెలింగ్ ప్రారంభం కానుండగా ఆయన డీఈవో అశోక్‌తో సమావేశమయ్యారు. అభ్యర్థులు ఇబ్బందులకు గురికాకుండా కౌన్సెలింగ్‌లో అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నారు.
News October 14, 2024
నల్గొండ: ఇందిరమ్మ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి: కలెక్టర్ నారాయణరెడ్డి
ఇందిరమ్మ కమిటీలను మంగళవారంలోగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ఈ రోజు జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఛైర్మన్‌గా, స్వయం సహాయక మహిళ సంఘాల నుంచి ఇద్దరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరుల నుంచి ముగ్గురు కన్వీనర్‌గా గ్రామపంచాయతీ కార్యదర్శితో గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
News October 14, 2024
NLG: ధాన్యం కొనుగోలు సమస్యలపై కంట్రోల్ రూమ్ ప్రారంభించిన కలెక్టర్
జిల్లాలో వానాకాలం ధాన్యం సేకరణకు సంబంధించి సమాచారం, ఫిర్యాదుల స్వీకరణకు ఉద్దేశించి కలెక్టరేట్‌లోని జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ నారాయణరెడ్డి ఈరోజు ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో ఏవైనా సమస్యలు తలెత్తిన 9963407064 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.