News October 24, 2024
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి: మంత్రి
నిత్యం రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సు యజమానులు చర్యలు చేపట్టాలని రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. విజయవాడలో నిర్వహించిన ప్రైవేటు ట్రావెల్స్ అసోసియేషన్ సమావేశంలో పలు అంశాలు, సమస్యలు, నూతన విధివిధానాలపై చర్చించారు. అనంతరం మంత్రి రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సు యజమానులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 3, 2025
VJA: మద్యం తాగే చోటు కోసం ఘర్షణ.. వ్యక్తి హత్య
మద్యం తాగే చోటుతో వచ్చిన వివాదం హత్యకు దారితీసిన ఘటన పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రామవరప్పాడుకు చెందిన వైకుంఠం న్యూ ఇయర్ రోజు ఓ శ్మశాన వాటికలో మద్యం తాగేందుకు వెళ్లాడు. అయితే రోజు వైకుంఠం తాగే చోట సాయి అనే వ్యక్తి ఉండడంతో గొడవపడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య ఇంటికి తీసుకురాగా.. మళ్లీ వైకుంఠం బయట వెళ్లాడు. మరో సారి ఘర్షణ పడడంతో సాయి కత్తితో హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.
News January 3, 2025
విజయవాడ: చిరంజీవి బుక్‌తో పవన్ కళ్యాణ్
విజయవాడలో బుక్ ఫెయిర్ గురువారం ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు స్టాల్స్‌లో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. మెగాస్టార్ చిరంజీవి సినీప్రస్థానం గురించి యూ.వినాయకరావు రచించిన “మెగాస్టార్ లెజెండ్ బుక్”ను ఆయన తీసుకున్నారు. సంబంధిత ఫొటోను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
News January 2, 2025
MTM : కానిస్టేబుల్ అభ్యర్థి మృతికి కారణాలివే.!
మచిలీపట్నంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో ఎ.కొండూరుకు చెందిన దారావత్ <<15046039>>చంద్రశేఖర్ (25) మృతి చెందడం<<>>పై పోలీసులు వివరణ ఇచ్చారు. కార్డియాటిక్ అరెస్ట్‌తో మరణించినట్లు వైద్యులు వెల్లడించారన్నారు. ప్రాథమికంగా పరీక్షలు చేసిన రిపోర్టుల్లో అతనికి SEPSIS కారణంగా WBC కౌంట్ 30వేలకు చేరిందన్నారు. అతను గత 5 రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోందని వైద్యులు తెలిపారు.