News February 21, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: కలెక్టర్

విజయవాడను ట్రాఫిక్ పరంగా క్రమశిక్షణతో కూడిన నగరంగా తీర్చిదిద్దడంలో అధికారులు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు అన్నారు. గురువారం విజయవాడ కలెక్టరేట్లో జరిగిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. స్వచ్ఛంధ సంస్థల అధ్యయన నివేదికలను క్షుణ్నంగా అధ్యయనం చేసి ప్రమాదాలు జరగకుండా పటిష్ఠ కార్యాచరణ అవసరమన్నారు.
Similar News
News October 18, 2025
దీపావళిని భద్రతతో జరుపుకోవాలి: కలెక్టర్

దీపావళి పండుగ సందర్భంగా జాగ్రత్త చర్యలు, భద్రతతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పిల్లలు బాణసంచా కాల్చేటప్పుడు పెద్దలు తప్పకుండా పర్యవేక్షించాలని అన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
News October 18, 2025
HYD: రెహమాన్‌పై మూడో కేసు నమోదు

జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న రెహమాన్‌పై <<17999949>>మరిన్ని కేసులు నమోదయ్యే<<>> అవకాశం ఉంది. విచారణలో భాగంగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ బాలల సదనంలో గతంలో మరో బాలుడిపై అతడు లైంగిక దాడి చేసినట్లు సైదాబాద్ పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మరో 10 మంది బాలలపై కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెహమాన్‌పై పోలీసులు మూడో కేసు నమోదు చేశారు.
News October 18, 2025
కామారెడ్డి: వరి కోత యంత్రాల యజమానులకు శిక్షణ

కామారెడ్డిలో వరి కోత యంత్రాల యజమానులకు శనివారం శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ నిర్వహించారు. వరి పంట పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే కోత ప్రారంభించాలని సూచించారు. యంత్రాలను 18 RPM వద్ద మాత్రమే నడపాలని, దీంతో గింజల నాణ్యత దెబ్బతినకుండా, తక్కువ తాలు గింజలు వస్తాయన్నారు. కోత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.