News March 2, 2025
రోడ్డు ప్రమాద ఘటనపై బస్సు డ్రైవర్పై కేసు నమోదు

కదిరి పరిధిలోని కుటాగుళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రొద్దుటూరు డిపో ఆర్టీసీ ఇంద్ర బస్సు డ్రైవర్ బాషాపై కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన ఏఎస్ దాదా పీర్ తండ్రి ఏఎస్ ముబారక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News October 21, 2025
మంథని: ఈనెల 24న రాజకీయ శిక్షణా శిబిరం

ఈనెల 24న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఖాదర్ గూడెంలో నిర్వహించే రాజకీయ శిక్షణ శిబిరాన్ని యాదవ సోదరులు వినియోగించుకోవాలని అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేషం యాదవ్ కోరారు. మంథనిలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవుల పాత్ర ఉండాలని అఖిల భారత మహాసభ నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగానే 24న పార్టీలకతీతంగా యాదవ సోదరులకు రాజకీయ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
News October 21, 2025
మురిపించని ‘మూరత్’.. ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు!

దీపావళి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ సెషన్ పెద్దగా మురిపించలేదు. మొదట లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 63 పాయింట్ల స్వల్ప లాభంతో 84,426 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 25,868 వద్ద ముగిశాయి. నిఫ్టీలో సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ట్రేడ్ అవగా, కొటక్ మహీంద్రా, ICICI బ్యాంకులు, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.
News October 21, 2025
భూమనకు నోటీసులు

మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి SVU క్యాంపస్ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. గోశాలపై ఆయన విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన వద్ద ఉన్న సాక్ష్యాలు, ఇతర ఆధారాలను చూపించాలని నోటీసులో పేర్కొన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు.