News March 15, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం: విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బాధితులకు శుక్రవారం రూ.2,50,000ల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్ ప్రమాదంలో చనిపోయిన సంతోషి కుటుంబానికి రూ.2లక్షలు ఇచ్చారు. తీవ్ర గాయాలైన శశాంక్‌కు రూ.50వేలను వారి బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇప్పటి వరకూ 21 మంది బాధితులకు రూ.15 లక్షలు అందించారు.
Similar News
News October 15, 2025
ఈనెల 17న కంచరపాలెంలో జాబ్ మేళా

కంచరపాలెం ఉపాధి కల్పనా కార్యాలయంలో అక్టోబర్ 17న జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ చదివిన వారు అర్హులు.ఈ జాబ్ మేళాలో మొత్తం 8కంపెనీలు పాల్గొనున్నాయి. అభ్యర్థులు తమ వివరాలను https://employment.ap.gov.in and https://www.ncs.gov.inలో రిజిస్టర్ అవ్వాలి. ఆరోజు ఉదయం 10గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు.
News October 15, 2025
పెందుర్తిలో 6.8కేజీల గంజాయి పట్టివేత

విశాఖ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మంగళవారం నిర్వహించిన పెట్రోలింగ్‌లో పెందుర్తి రైల్వే స్టేషన్ వెలుపల అనుమానితులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో ప్రకాశం జిల్లాకు చెందిన కువ్వరపు వినీల్ కుమార్, షేక్ సలీం అనే ఇద్దరు వ్యక్తులు రూ.40వేలు విలువ గల 6.8 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముద్దాయిలను పెందుర్తి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.
News October 14, 2025
విశాఖ: బంపర్ డ్రా.. లింక్ క్లిక్ చేస్తే..!

ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ సిటీ పోలీసులు సూచించారు. లాటరీ, బంపర్ డ్రాలు గెలుచుకున్నారంటూ సైబర్ నేరగాళ్లు ఆశ చూపిస్తారని, అది నమ్మి లింక్ క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కోల్పోతారని చెప్పారు. అటువంటి మెసెజ్‌లకు స్పందించవద్దని కోరారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే టోల్‌ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.