News January 30, 2025

రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలి: రోహిత్ రాజ్

image

కొత్తగూడెం ప్రకాశం మైదానంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, డీఎస్పీ రెహమాన్, ట్రాఫిక్ ఎస్ఐ నరేశ్ ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియంలో గురువారం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఆటో డ్రైవర్లు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ అధికారులు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News December 7, 2025

WGL: వామ్మో మేం ఓటేస్తే మా పని ఖతమే..!

image

పంచాయతీ ఎన్నికలు విధుల్లో పాల్గొనే ఉద్యోగులను కలవర పెడుతున్నాయి. డ్యూటీ చేసే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తారు. ఓట్ల లెక్కింపుల్లో ఆ ఉద్యోగి ఎవరికి ఓటు వేశారో స్పష్టంగా తెలిసే అవకాశం ఉండడంతో, ఎందుకొచ్చిన గొడవ అంటూ చాలా మంది పోస్టల్ బ్యాలెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గ్రామ పోరులో వార్డు ఓటర్లు వందల సంఖ్యల్లోనే ఉండడమే వారికి భయం పట్టుకుంది.

News December 7, 2025

బాపట్ల జిల్లాలో ఎంతమంది రౌడీషీటర్లు ఉన్నారంటే

image

జిల్లాలో మొత్తం 1,013 మంది రౌడీ షీటర్లు ఉన్నారని బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ శనివారం తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరచూ నేరాలకు పాల్పడే వారికి పీడీ చట్టం ప్రయోగించడం, అవసరమైతే జిల్లా బహిష్కరణ విధించడానికి కూడా బోమన్నారు. ఇప్పటికే 32 మందిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

News December 7, 2025

జ్యోతిషుడి సలహా.. బీబీనగర్ సర్పంచ్ బరిలో భార్యాభర్తలు

image

బీబీనగర్ సర్పంచ్ ఎన్నికల బరిలో నారగొని మహేష్ గౌడ్ తన భార్య శ్రీలతతో కలిసి పోటీకి దిగారు. జ్యోతిషుడి ఇచ్చిన సలహా మేరకు, భార్యాభర్తలు ఇద్దరూ బరిలో ఉంటే విజయం ఖాయమని భావించి, ఆయన శ్రీలతను నామినేషన్ వేయించారు. అధికారులు విడుదల చేసిన బ్యాలెట్ పత్రాల్లో ఇద్దరి పేర్లు ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. విజయం ఎవరికి దక్కుతుందోనని గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.