News January 17, 2025
రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

రోడ్డు భద్రతా మాసోత్సవాలలో వాహన చోదకులను భాగస్వాములు చేసి రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. గురువారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కరపత్రాలు, ఫ్లెక్సీ బ్యానర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాలలో వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News December 6, 2025
కర్నూలు కలెక్టర్ నేతృత్వంలో పంటపై సమీక్ష.!

కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి వివిధ పంటల మార్కెటింగ్‌పై ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయమైన ధర లభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, వ్యవసాయ అధికారులతోపాటు అనుబంధ శాఖల అధికారులు ఉన్నారు.
News December 6, 2025
హోంగార్డుల సేవలు ప్రశంసనీయం: జిల్లా SP.!

పోలీసుశాఖలో హోంగార్డుల విధులు, సేవలు ఆదర్శప్రాయమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అభినందించారు. శనివారం పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. హోంగార్డులు పోలీసులతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో ముందుంటారన్నారు.
News December 6, 2025
బిల్వ స్వర్గం గుహల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్.!

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని కనుమకింది కొట్టాల గ్రామ సమీపాన ఉన్న బిళ్ళస్వర్గం గుహల వద్ద సినిమా షూటింగ్ సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా యూనిట్ బృందం గుహల సన్నివేశాల చిత్రీకరణ కోసం వచ్చింది. దీంతో ఈ సందర్భంగా సినిమా యూనిట్ బృందం తరలిరావడంతో గుహల్లో సందడి వాతావరణం నెలకొంది.


