News April 11, 2025
రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి: CP

సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధను సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి క్రిస్టోఫర్ పురుషోత్తమ్ మర్యాద పూర్వకంగా కలిశారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Similar News
News October 19, 2025
గుంతకల్లు: రైళ్లకు అదనపు బోగీలు జోడింపు

దీపావళి పండగ సందర్భంగా ప్రయాణాల రద్దీ దృష్ట్యా అనంతపురం రైల్వే స్టేషన్ మీదుగా పలు రైళ్లకు అదనపు బోగీలు జోడిస్తున్నట్లు గుంతకల్లు డివిజన్ అధికారులు తెలిపారు. కలబుర్గి – బెంగళూరు రైలు 06208 అక్టోబర్ 21న, ఫర్నగర్బెం – గలూరు రైలు 06262 అక్టోబర్ 24న గుంతకల్లు మీదుగా అదనపు బోగీలతో నడుస్తుందని వివరించారు.
News October 19, 2025
కామారెడ్డిలో మటన్, చికెన్ ధరల వివరాలు..!

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం మటన్, చికెన్ ధరలు గత వారం మాదిరిగానే స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో మటన్ ధర రూ.800గా ఉంది. కిలో చికెన్ స్కిన్ లెస్ రూ.240, లైవ్ కోడి ధర కిలో రూ.160గా విక్రయిస్తున్నారు. మాంసం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.
News October 19, 2025
ఖమ్మం జిల్లాలో 4,043 దరఖాస్తులు

ఖమ్మం జిల్లాలో 116 వైన్స్లకు 4,043 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న ఏకంగా 1,653 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షలు చొప్పున 121.29 కోట్లు ఆదాయం సమకూరింది. గత పాలసీలో 122 వైన్స్లకు 7200 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున రూ. 144 కోట్ల ఆదాయం లభిచింది. ఈ నెల 23 వరకు గడువు పొడిగించడంతో దరఖాస్తులు పెరిగే అవకాశముంది.