News April 11, 2025
రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి: CP

సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధను సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి క్రిస్టోఫర్ పురుషోత్తమ్ మర్యాద పూర్వకంగా కలిశారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Similar News
News April 23, 2025
నాగర్‌కర్నూల్: దరఖాస్తుల ఆహ్వానం

నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల స్థాయిలో మండల, జిల్లా స్థాయి రీసోర్స్‌పర్సన్లుగా పని చేసేందుకు ఆసక్తి గల ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు. గురువారంలోగా నాగర్‌కర్నూల్‌లోని డీఈవో ఆఫీస్‌లో దరఖాస్తులు అందించాలని సూచించారు.
News April 23, 2025
PSR ఆంజనేయులుకు రిమాండ్

AP: ఐపీఎస్ అధికారి PSR ఆంజనేయులుకు విజయవాడ మూడో ఏసీజేఎం కోర్టు మే 7 వరకు రిమాండ్ విధించింది. ముంబై నటి జెత్వానీ కేసులో నిన్న సీఐడీ పోలీసులు ఆయనను HYDలో అరెస్టు చేశారు. ఆమెపై అక్రమ కేసు బనాయించిన కేసులో ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. ఈయన జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు.
News April 23, 2025
ఉగ్రదాడి.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

పహల్‌గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వనుంది. ఈ ఘటనలో మొత్తం 28 మంది చనిపోగా, అందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు.