News February 1, 2025
రోడ్డు భద్రత మనందరి బాధ్యత: భద్రాద్రి కలెక్టర్

రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుంచి రైల్వే స్టేషన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
Similar News
News December 12, 2025
నకిలీ కాఫ్ సిరప్ తయారీ.. ED సోదాలు

అక్రమ కాఫ్ సిరప్ తయారీ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసు నమోదు కావడంతో ED సోదాలు చేస్తోంది. నిందితుడు శుభమ్ జైస్వాల్, అనుచరులు అలోక్ సింగ్, అమిత్ సింగ్ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తోంది. యూపీ, ఝార్ఖండ్, గుజరాత్‌లోని 25 ప్రాంతాల్లో ఉదయం 7:30 గంటల నుంచి ఏకకాలంలో దాడులు చేస్తోంది. యూఏఈలో తలదాచుకుంటున్న జైస్వాల్‌ను భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
News December 12, 2025
కడపలో కలకలం రేపుతున్న మేయర్ ఫ్లెక్సీ.!

మేయర్‌గా ఎన్నికైన మరుసటిరోజు పాకా సురేశ్‌కు షాక్ తగిలింది. ఇంటి పన్ను చెల్లించలేదంటూ కోటిరెడ్డి సర్కిల్లోని స్టేట్ గెస్ట్‌హౌస్ వద్ద భారీ కటౌట్ వెలిసింది. YCP రంగుతో ఏర్పడిన కటౌట్‌ను కొద్దిసేపటికి నగరపాలక అధికారులు తొలగించారు. ఈ ఫ్లెక్సీలో ఎవర్రా నన్ను ఆపేది.. ఇదేమి కర్మ మన కడపకు నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటూ ఫ్లెక్సీలో ప్రింట్ చేయించారు. ఈ ఫ్లెక్సీ ఎవరు పెట్టారన్నదానిపై చర్చ జరుగుతోంది.
News December 12, 2025
9 మంది దుర్మరణానికి చింతిస్తున్నాం: పవన్ కళ్యాణ్

మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా పడి 9మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎక్స్ వేదికగా 9మంది మరణాలకు చింతిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన 22మందికి మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.


