News January 4, 2025
రోడ్డు భద్రత సమాజంలో అందరి బాధ్యత: మంత్రి పొన్నం

రోడ్డు భద్రత సమాజంలో అందరి బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్‌పై ప్రతి పాఠశాలలో యునిసెఫ్ సహకారంతో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేసి విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పిస్తామన్నారు. తొలి దశలో 500 నుంచి 1000 పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.
Similar News
News November 22, 2025
HYD: స్టేట్ క్యాడర్ మావోయిస్టులు లొంగుబాటు.!

రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) బి.శివధర్ రెడ్డి ముందు నేడు భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు. స్టేట్ క్యాడర్‌కు చెందిన అజాద్, అప్పా నారాయణ, ఎర్రాలు సహా పలువురు మావోయిస్టులు లొంగుబాటు కార్యక్రమానికి హాజరు కానున్నారు. లొంగుబాటుకు సంబంధించిన మరిన్ని వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.
News November 22, 2025
HYD: పంచాయతీ ఎన్నికలు.. అబ్జర్వర్లతో ఎస్ఈసీ కీలక సమావేశం

తెలంగాణలో పంచాయితీ ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల సిద్ధతల్లో భాగంగా ఈరోజు జిల్లాలవారీగా అబ్జర్వర్లతో ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. వచ్చే వారంలోనే పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి దశలో ఉన్నాయి. అబ్జర్వర్లతో కీలక సమావేశం పూర్తయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకొని షెడ్యూల్ విడుదల చెయ్యనుంది.
News November 22, 2025
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన CISF సెక్యూరిటీ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. క్షుణ్ణంగా అనుమానిత వస్తువులను పరిశీలించారు. సందర్శకుల పాసుల కౌంటర్ మూసివేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని, అది ఫేక్ మెయిల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.


