News January 29, 2025

రోడ్డు మరమ్మతులకు నిధులు విడుదల

image

గుంతలమయమైన రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. అందులో నియోజకవర్గాల వారీగా.. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.15.38 కోట్లు విడుదల చేశారు. అలాగే మధిర నియోజకవర్గంలో 10.90 కి.మీ.కు రూ.16.48కోట్లు, పాలేరు నియోజకవర్గంలో 29.04 కి.మీ.మేర రోడ్ల మరమ్మతుకు రూ.15.17కోట్లు, వైరా నియోజకవర్గంలో 29 కి.మీ.మేర మరమ్మతులకు రూ.13.67కోట్లు, సత్తుపల్లి నియోజకవర్గంలో 12పనులకు రూ.14.87 కోట్లు విడుదలయ్యాయి.

Similar News

News February 18, 2025

ఖమ్మం: అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ 

image

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పెండింగ్ లేకుండా వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు.

News February 17, 2025

ఖమ్మం: KCRపై అభిమానం అదుర్స్‌

image

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కస్నాతండాలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మిర్చి రైతులు వినూత్నంగా మిరప కల్లంలో హ్యాపీ బర్త్ డే కేసీఆర్ అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రైతు లక్న్మయ్య తన మిర్చి కల్లాంలో కేక్ కట్ చేసి కేసీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

News February 17, 2025

ఖమ్మం: ‘మా చెవుల్లో పూలు పెడుతున్నారు’ 

image

పాలకులు ఏదో ఒక సాకు చెబుతూ తమ చెవుల్లో పూలు పెడుతున్నారంటూ ఖమ్మం జిల్లా జర్నలిస్టులు ఎద్దేవా చేశారు. సోమవారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో చెవుల్లో పూలు పెట్టుకుని వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగే వరకు ఏదో ఒక రూపంలో నిత్యం నిరసనలు తెలుపుతూనే ఉంటామని, ఇందుకు అన్ని జర్నలిస్టు సంఘాలు ముందుకొచ్చేలా కృషి చేస్తామని వారు ప్రతిన బూనారు. 

error: Content is protected !!