News May 26, 2024
రోళ్ల: మేకల మందపై చిరుత దాడి

రొళ్ల మండల పరిధిలోని బంద్రేపల్లి గొల్లహట్టి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున శివన్న మేకల మంద పై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఒక మేక, రెండు పెంపుడు కుక్కలు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. మేక మృతితో 8 వేలు నష్టం జరిగిందని ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Similar News
News February 17, 2025
అనంతపురం: అలర్ట్.. గ్రీవెన్స్‌డే స్థలంలో మార్పు

రాయదుర్గం పట్టణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని బళ్లారి రోడ్డు సీతారామాంజనేయ కళ్యాణమండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్వామా హాలు నుంచి సీతారామాంజనేయ కళ్యాణ మంటపానికి మార్చినట్లు కలెక్టర్ అధికార వర్గాలు తెలిపాయి. ప్రజలు ఈ స్థల మార్పును గమనించాలని కోరారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
News February 16, 2025
చెత్త విషయంలో తల్లి, కొడుకుపై కత్తితో దాడి

గుత్తి ఆర్ఎస్‌లో చెత్త పడేసే విషయంలో ఇరువర్గాల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఇంటిముందు చెత్త పడేశారని వంశీ, అతని తల్లి సాయమ్మపై రిజ్వానా, రసూల్ కత్తితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వంశీ, సాయమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
News February 16, 2025
విద్యార్ధి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలి: JNTU ఇన్‌ఛార్జ్ వీసీ

అనంతపురంలోని JNTU-OTPRIలో శనివారం ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శన రావు పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసం కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వీసీతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.