News March 4, 2025
రౌండ్లవారీగా MLC అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇవే.!

MLC ఎన్నికల్లో 5 రౌండ్లలో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇవే. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రకి మొదటి రౌండ్-17194, రెండవ రౌండ్ -17527, మూడవ రౌండ్-16723, నాలుగో రౌండ్-16236, ఐదో రౌండ్-16,916 ఓట్లు చొప్పున వచ్చాయి. మరోవైపు PDF అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్ రావుకు మొదటి రౌండ్-7214, రెండవ రౌండ్-6742, మూడవ రౌండ్-7404, నాలుగో రౌండ్-7828, ఐదో రౌండ్-7535 చొప్పున ఓట్లు రాగా..47872 ఓట్లతో ఆలపాటి గెలిచారు.
Similar News
News March 22, 2025
ఎమ్మెల్సీ దువ్వాడకు డాక్టరేట్

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడకు “DAYSPRING INTERNATIONAL UNIVERSITY” డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ఈ మేరకు తాజాగా శుక్రవారం హైదరాబాద్ యూనివర్సిటీలో తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా శ్రీనివాస్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఆయనను పలువురు అభినందించారు.
News March 22, 2025
రాష్ట్రంలో కొత్తగా 70 బార్ల ఏర్పాటు!

TG: ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తోంది. కొత్తగా 70 బార్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఇన్‌కమ్ ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 1,171 బార్లు ఉండగా వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్నాయి. మైక్రోబూవరీల సంఖ్యను పెంచే అవకాశమున్నట్లు సమాచారం.
News March 22, 2025
కరీంనగర్: వరుసగా మృతదేహాలు లభ్యం

ఉమ్మడిKNR జిల్లావ్యాప్తంగా వరుసగా మృతదేహాలు లభ్యమవుతున్నాయి. గురువారం KNR జిల్లా చిగురుమామిడి(M) ఇందుర్తికి చెందిన అందే మల్లవ్వ అనే వృద్ధురాలి మృతదేహం తిమ్మాపూర్ ఎల్ఎండీ జలాశయం వద్ద లభ్యంకాగా, KNRలోని NTR విగ్రహం సమీపంలోని నాలాలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. వేములవాడ(M)అగ్రహారంలో గుర్తుతెలియని మగ మృతదేహం కనిపించింది. నిన్న HZB(M)తుమ్మనపల్లి SRSPకెనాల్‌లో అరవింద్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.