News March 22, 2025

రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సిర్పూర్ MLA

image

హైదరాబాద్‌లోని FTCCIలో ప్రజ్ఞ భారతి ఆధ్వర్యంలో శుక్రవారం బడ్జెట్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిర్పూర్ MLA డా.పాల్వాయి హరీశ్ బాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పద్దులో అనేక కాకి లెక్కలు చెప్పిందని ఆరోపించారు. బడ్జెట్ మీద చూపిస్తున్న అంకెలకు, ఖర్చులకు పొంతనే లేదని విమర్శించారు. కార్యక్రమంలో సాయిప్రసాద్, శ్రీనివాస్ తదితరులున్నారు.

Similar News

News January 9, 2026

ప్రకాశం: రుణాలు పొందిన వారికి గుడ్ న్యూస్

image

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే అర్జున్ నాయక్ కీలక సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాలో కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందిన వారు కొవిడ్-19 కారణంగా గతంలో రుణాలు చెల్లించలేదన్నారు. అటువంటి వారి కోసం ప్రస్తుతం వడ్డీ రద్దుతో నగదు చెల్లించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 30లోగా రుణాలు వడ్డీ లేకుండా చెల్లించి రుణాలను మాఫీ చేసుకోవచ్చన్నారు.

News January 9, 2026

వీళ్లెవరండీ బాబూ.. స్పీడ్ బ్రేకర్లను ఎత్తుకెళ్లారు

image

MPలోని విదిశ(D)లో ఓ వింతైన దొంగతనం జరిగింది. ఇటీవల రూ.8 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను దొంగలు రాత్రికి రాత్రే మాయం చేశారు. మెయిన్ రోడ్డు, దుర్గా నగర్ చౌక్, డిస్ట్రిక్ట్ కోర్టు, వివేకానంద చౌక్ మధ్య ప్రాంతాల నుంచి వీటిని ఎత్తుకెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే ఈ చోరీ జరగడంతో విమర్శలు వస్తున్నాయి. స్పీడ్ బ్రేకర్లే సురక్షితంగా లేకపోతే తమ భద్రత ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

News January 9, 2026

కాశీ సెట్‌లో హైఓల్టేజ్ యాక్షన్‌

image

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ సినిమా ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాగా కాశీ నగరాన్ని తలపించే భారీ సెట్‌లో యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్‌బాబు, ప్రకాశ్‌రాజ్ కాంబినేషన్‌లో వచ్చే సీన్లను పూర్తి చేసిన మేకర్స్, ప్రస్తుతం హైఓల్టేజ్ యాక్షన్‌పై ఫోకస్ పెట్టారు.