News March 29, 2024
రౌడీ షీటర్లపై స్పెషల్ ఫోకస్: చందనా దీప్తి

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక వ్యక్తులు, రౌడీషీటర్లు, ట్రబుల్ మంగ్లర్స్ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు నల్గొండ ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అటు అక్రమ మద్యం, నగదు సరఫరా కాకుండా పటిష్ఠ నిఘాతో తనిఖీలు నిర్వహించాలని సూచించారు
Similar News
News November 17, 2025
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు: ఇలా త్రిపాఠి

నల్గొండ కలెక్టరేట్లో సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు అందాయి. 73 పిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవెన్యూ శాఖకు సంబంధించినవి వచ్చాయి. ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు.
News November 17, 2025
చలికి గజ గజ.. మంటలతో ఉపశమనం..!

నల్గొండ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి చల్లని గాలులు వీచడం ప్రారంభమై తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఈ చలి ప్రభావం అధికంగా ఉంది. అనేక చోట్ల చలి నుంచి ఉపశమనం పొందడానికి గ్రామాలలో ఎక్కువ శాతం మంటలు వేసుకుంటున్నారు.
News November 17, 2025
సమ్మె వద్దు.. సమస్యలు పరిష్కరిస్తాం: నల్గొండ కలెక్టర్

పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మె విరమించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా తాము రాష్ట్ర అసోసియేషన్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని జిన్నింగి మిల్లుల యజమానులు కలెక్టర్కు తెలిపారు.


