News September 29, 2024
రౌడీ షీటర్లు మంచి మార్గంలో జీవించండి: ఎస్పీ సతీశ్
గుంటూరు నగరంలోని రౌడీషీటర్లకు ఆదివారం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీశ్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రౌడీషీటర్లు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి పద్ధతి మార్చుకొని మంచి మార్గంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించాలని సూచించారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగుతుందని చెప్పారు.
Similar News
News October 15, 2024
గుంటూరు: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో టీవీ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోర్స్ కో-ఆర్డినేటర్ మధుబాబు సోమవారం తెలిపారు. రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ విధానంలో ఈ కోర్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సులో ప్రవేశాలు పొందేందుకు ఏదైనా డిగ్రీ కోర్స్ ఉత్తీర్ణత కలిగి ఉండాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
News October 14, 2024
అమరావతి డ్రోన్ సదస్సు నిర్వహణకు ఉత్తర్వులు
అక్టోబరు 22, 23వ తేదీల్లో జరగనున్న అమరావతి డ్రోన్ సదస్సు-2024 నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సదస్సు నిర్వహణకు రూ.5.54 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో 2 రోజుల పాటు ఈ జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.
News October 14, 2024
నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
జైల్లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్‌ను గుంటూరు జిల్లా కోర్టు కొట్టి వేసింది. వెలగపూడిలో మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కొరకు జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.